---Advertisement---

అంతర్ జిల్లా దొంగ అరెస్టు.. సంగారెడ్డి ప్రజలకు పోలీసుల అప్రమత్తత

సంగారెడ్డి ప్రజలకు జిల్లా పోలీసుల అలెర్ట్
---Advertisement---

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.18 లక్షల విలువ గల 24-తులాల బంగారం, టీవీస్వాధీనం చేసుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముద్దంగి భీమేష్ కూలీ జిన్నారంలో ఉంటూకూలీ పని చేసుకుంటున్నాడు. ఇతడు గత కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రాత్రి పూట నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

గత మార్చిలో రామచంద్రపురం పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు ఇళ్ళల్లో, అక్టోబర్ నెలలో హయత్ నగర్ పీయస్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని రెండు ఇళ్ళలో, నవంబర్ నెలలో అమీన్ పూర్ పీయస్ పరిధిలోని ఏడు ఇళ్ళలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ బంగారు వెండి ఆభరణాలు మరియు నగదు చోరీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్ పూర్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, సిసియస్ ఇనిస్పెక్టర్ శివ కుమార్ పర్యవేక్షణలో సిసియస్ ఎస్ఐ శ్రీకాంత్, అమీన్ పూర్ ఎస్ఐ విజయ్ రావ్, హెడ్ కానిస్టేబుల్ రేక్యా, కానిస్టేబుళ్లు అన్వర్, శశి, సలీం, ప్రశాంత్, ప్రేం సింగ్ సిబ్బందితో టీం ను ఫామ్ చేసి అంతర్ జిల్లా నేరస్థుడిని పట్టుకోవడానికి దొరికిన క్లూస్ తో గత కొన్ని రోజులుగా గాలిస్తూ ఆదివారం సాయంత్రం అమీన్ పూర్ బీఆర్ఎస్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో నేరస్థుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. వద్ద నుండి నేర సొత్తును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. తమ తమ కాలనీ, నివాస సముదాయాలలో సీసీ కామెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరుచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment