తపస్ రాయి కోడ్ మండల అధ్యక్షుడిగా సింగితం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి గా కోడూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపధ్యాయుడు రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తపస్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు తుక్కప్ప ఆధ్వర్యంలోఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యాదయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమం లో న్యాల్ కల్ మండల అధ్యక్షుడు కృష్ణ , ఝరాసంగం మండల అధ్యక్షుడు కృష్ణ , మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తపస్ రాయి కోడ్ మండల అధ్యక్షుడిగా యాదయ్య
by news writer
Published On: December 7, 2024 2:35 pm

---Advertisement---





