గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ దిశగా తాజాగా చర్యలు ప్రారంభించింది. ప్రతి రెవెన్యూ గ్రామానికొక రెవెన్యూ అధికారి నియామకం కోసం చర్యలు మొదలు పెట్టింది. పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో పోస్టులోకి తీసుకోవాలని చూస్తోంది.గత ప్రభుత్వంలో అర్హులైన వీఆర్వోలు ఇతర శాఖలకు బదలాయించిన నేపథ్యంలో ఇతర శాఖల నుంచి తీసుకుని వీఆర్వోలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్ఏ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కలెక్టర్ల పర్యవేక్షణలో ఇతర శాఖల నుంచి వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రభుత్వం షురూ చేసింది.
మళ్లీ వీఆర్వోలు వచ్చేస్తున్నారు.. నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్
by news writer
Updated On: December 23, 2024 7:01 pm

---Advertisement---







