---Advertisement---

బిల్డింగ్ పర్మిషన్లకు సరికొత్త యాప్.. అవినీతి నిఖిష్ లను ఆపుతుందా?

The government is going to bring a new system called Build Now for building permissions.
---Advertisement---

భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ దన్నుగా భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను సులభంగా, వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం దోహదం చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి, 2025 నుంచి ఈ కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారి చేతులమీదుగా ప్రారంభించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తుందన్నారు. ee మేరకు బిల్డ్ నౌ యాప్ ను పరిచయం చేశారు.

ఆ అవినీతి జలగలను ఆపుతుందా..?
వేగవంతమైన అనుమతుల పేరుతో ప్రభుత్వం తీస్తున్న ఈ కొత్త విధానం స్వాగతించదగినదే కానీ ఇన్నాళ్లు అనుమతులు ఇచ్చేందుకు లంచాల కోసం ప్రజల రక్త మాంసాలను పీక్కు తిన్న అవినీతి జలగలా మాటేంటి. ఇటీవలే నీటి పారుదల శాఖ ఏఈఈ నీఖేష్ కుమార్ లంచవతారం కాదుకాదు.. లంచాల విశ్వరూపం బట్టబయలైంది. అలాంటి అవినీతి జాతికి ఈ కొత్త విధానం అడ్డుకట్ట వేస్తుందా? లేక ఈ ప్రజాస్వామ్య దేశంలో కూసింత అవినీతి కంపు సహజమే అని ప్రోత్సాహించేలా చేస్తుందా అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment