తెలంగాణ సీపీఐ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేశ్ తుది శ్వాస విడిచారు. ఛాతిలో నొప్పితో శివారం ఇంట్లోనే ఆయన కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలమల్లేశ్ మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు సీపీఐ పార్టీకి తీరని లోటు అని కనియాడారు.
తెలంగాణ సీపీఐలో తీవ్ర విషాదం
by news writer
Published On: November 30, 2024 7:02 pm

---Advertisement---







