---Advertisement---

ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబురు

Double Bedroom scheme Telangana CM Revanth reddy
---Advertisement---

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యంత నిరుపేదలకు తొలిప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లపై సమీపక్ష నిర్వహించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల ఎంపికలో ప్రయార్టీ ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గ్రామ కార్యదర్శి, మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ లో సాంకేతిక సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలోనిని ఇండ్లకు ప్రత్యేక కోటా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనపరిస్తే అందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment