సంధ్య థియేటర్ ఘటన వివాదం అల్లుఅర్జున్ ను వీడటం లేదు. ఈ వ్యవహారంలో ఓ వైపు రాజకీయ దుమారం మరో వైపు పోలీసుల స్టేట్ మెంట్లతో ఇష్యూ కాంప్లికేట్ అవుతున్న నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత కలకలం రేపింది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆదివారం ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి జేఏసీ నేతలు దూసుకెళ్లారు. అల్లు అర్జున్ ఇంటిపైకి రాళ్లు విసిరి.. ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు. రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
అల్లుఅర్జున్ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఇంట్లోకి దూసుకెళ్లిన జేఏసీ నేతలు
by news writer
Published On: December 22, 2024 1:25 pm

---Advertisement---