తెలుగు గడ్డపైన ఏదైన బ్రాండ్ ను ప్రజలు విశ్వసితే అంత తొందరగా వదులుకోరు. సరిగ్గా తెలుగు ప్రజలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక అంశాలతో బంధం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్.. పల్లెల్లో ముద్దుగా పిలుచుకునే ఏపీజీవిబి బ్యాక్ పేరు మారబోతున్నది. కొత్త ఏడాదిలో కొత్త పేరుతో సేవలు అందించబోతున్నామని ఆ బ్యాంక్ యాజమాన్యం ప్రజా ప్రకటన కూడా విడుదల చేసిసింది. 1 జనవరి 2025 నుండి తెలంగాణాలోని 439 ఏపీజీవిబి శాఖలు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ TGBలో విలీనం చేయబడుతుంది.
సేవలకు స్వల్ఫ విరామం:
విలీన ప్రక్రియలో భాగంగా ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా 28 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు అన్ని శాఖల్లో బ్యాంకింగ్ సేవలు, అన్ని ఆన్ లైన్ సేవల్లో (UPI, ATM, MOBILE BANKING) అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏటీఎంల మార్పు అప్పటి నుంచి:
మరో వైపు ఈ విలీన ప్రక్రియపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సైతం ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని APGVB శాఖలకు సంబంధించిన ఖాతాదారులు ఏటీఎం కార్డు మార్చుకునేందుకు, మొబైల్ బ్యాంకింగ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI సేవలలో తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు 1 జనవరి 2025 నుండి మీ బ్యాంక్ శాఖలను సంప్రదించాలని పేర్కొంది.మరిన్ని వివరాలకు www.tgbhyd.in ను లేదా సమీప శాఖను సంప్రందించాలని సూచించింది.
ఆ ఒక్కటి మార్చుకుంటే తిరుగే లేదు:
గ్రామీణ ప్రాంతాల్లో పాతుకుపోయిన ఏపీజీవిబి సేవల విషయంలో తరచూ ఖాతాదారుల సహనాన్ని పరీక్షస్తూనే వస్తుంది. ఇది స్వయంగా ఆ బ్యాంక్ ఖాతాదారుల ఫీడ్ బ్యాక్.
చివరగా.. “మీరే అన్నారు కదా సార్ మేమంతగా సెంటిమెంటల్ ఫూల్స్ అని.. మా తెలుగు ప్రజలు అంత త్వరగా అభిమానం పెంచుకోరు.కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టం”.. ఇది ఠాగూర్ సినిమాలో గూస్ బంబ్స్ తెప్పిచే డైలాగ్.. మరి ఏపీజీవిబికి అంతలా సింక్ అయినా గ్రామీణ ప్రజలు ఈ కొత్త పేరుతో ఎలా సింక్రనైజ్ అవుతారు? పేరు మార్చుకున్న గ్రామీణ బ్యాంకులు సేవల తీరులో మెరుగుదల ఎలా ఉండబోతుంది అనేది చూడాలి మరి.








Standard information posting by mana muchhatlu .. Keep it up