---Advertisement---

అల్లు అర్జున్ అరెస్ట్ టు రిలీజ్.. అసలు ముచ్చట పార్ట్-2 లో!

---Advertisement---

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాల కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం రిమాండ్ విధించడం ఆపై బెయిల్ రావడం అంతా సినిమాటిక్ లెవల్లో జరిగిపోయింది. బెయిల్ వచ్చినా నిన్న గత రాత్రి జైల్లోనే ఉన్న పుష్ప ఇవాళ ఉదయం విడుదలయ్యారు. ఇక్కడితో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ముగిసిపోయింది. కానీ ఇకపై జరగబోయేదే పరిణామాలే అసలు సిసలు ‘వైల్డ్ ఫైర్’ అని సోషల్ జోరుగా వినిపిస్తోంది.  జైలు నుండి విడుదల అయ్యాక అల్లు అర్జున్ మాట్లాడిన తీరు వైరల్ అవుతున్నది.

నేను చట్టాన్ని గౌరవిస్తాను. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఇలా జరగలేదు. చనిపోయిన రేవతి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ అంటూ ఎలాంటివివాదం లేకుండా స్పందించి ఇంటికి వెళ్లారు.

అయితే అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అని అధికార పక్షం వాదిస్తుంటే ఇదంతా కక్ష్య పూరితంగా చేశారాని ముఖ్యంగా బెయిల్ వచ్చినా రిలీజ్ చేయకుండా రాత్రి జైల్లో ఉంచడం అంతా ఉద్దేశపూర్వకంగానే చేయారని అల్లు అర్జున్ అభిమానులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కొందరూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్  పోలిటికల్ టర్న్ తీసుకుంటోంది.

ఈ ఎఫెక్ట్ తో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అని ఆయన అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పీకే టీం తో అల్లు అర్జున్ చర్చలు జరిపారానే వార్తలు వచ్చినా వాటిని అల్లు టీమ్ ఖండించింది. తాజా పరిణామలతో పొలిటికల్ వ్యూహంతోనే అల్లు అర్జున్ సమాధానం ఇవ్వబోతున్నారు అనే చర్చ బలంగా వినిపిస్తోంది. బెయిల్ పై బయటకు వచ్చిన పుష్ప ఈ సెకండ్ ఎపిసోడ్ లో ఎలాంటి అడుగులు వేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన విషయం.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment