---Advertisement---

రేవంత్ రెడ్డి మిడిసిపడకు.. సీఎంపై ఈటల స్ట్రాంగ్ కామెంట్స్

---Advertisement---

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట్లాడే మాటలకు పొంతనలేదని,
అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
మళ్లీ ఐదేండ్లకు ఓట్ల కోసం రావాలని మర్చిపోవద్దన్నారు. పదవులు శాశ్వతం కాదు మిడిసిపడవద్దni, అధికారం రాగానే ఓట్లు వేసిన వారందరినీ మర్చిపోవద్దన్నారు.ఆగమాగం అయితే ప్రజలు మిమ్మల్ని ఆగమగం చేస్తారని హెచ్చరించారు.

శనివారం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం.. చేస్తున్న మహాధర్నా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో సీఎం గమనించాలని, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒక రకమైన భయం ఆవరించి ఉందన్నారు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఐదు నెలలుగా ఎన్నడూ కంటిమీద కునుకు లేదు.. సమస్యల వలయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
ఈరోజు చెన్నాపురం వెళ్లాను అది పేదోళ్ల అడ్డా.. భాజప్త కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. బి.ఆర్.ఎస్, ఎల్.ఆర్.ఎస్ కట్టారు.
మీరు చెప్తున్న అందమైన ప్రపంచానికి మేము వ్యతిరేకం కాదు..
కానీ పేదల ఇల్లు కూలగొట్టడాన్ని తీవ్రంగా వెతికిస్తున్నాం.
నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పేదల ఇళ్ళ జోలికి రావాలి.
ఇల్లు కూల్చి కడుపు కొట్టవద్దు.
హైడ్రా, మూసి ప్రక్షాళన, చెరువుల ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు.

ప్రభుత్వం మోకాలికి బోడగుండుకి ముడిపెడుతుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.
ప్రజా వ్యతిరేకతకు కెసిఆర్ కి పదేళ్లు పడితే.. మీకు పది నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరింత పెంచుకోకండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment