---Advertisement---

సంగారెడ్డిలో తప్పిన పెను ప్రమాదం

Accident at Sangareddy
---Advertisement---

సంగారెడ్డి జిల్లాలో వరుస ప్రమాదాలు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా అందోల్ మండలం కన్సాన్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లిది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఇటీవలే ఓ కారు డివైడర్ ను ఢి కొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన మరువకముందే ఈ యాక్సిడెంట్ జరగడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment