కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఉద్దేశించి చేసి వ్యాఖ్యలు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసనగా మంగళవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఏర్పాటు చేసిన ప్రజా సభ వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రజలకు, మీడియా ప్రతినిధులు సహకరించాలని పార్టీకోరింది. ప్రజా సభ మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామనే సమాచారం త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
జగ్గారెడ్డి ప్రజాసభ వాయిదా
by news writer
Published On: December 23, 2024 6:29 pm

---Advertisement---