---Advertisement---

అమిత్ షా ను సస్పెండ్ చేయండి.. సామాజిక ప్రజా సంఘాల డిమాండ్

అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న సంగారెడ్డి
---Advertisement---

అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యతం రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐబీ నుండి కకొత్త బస్టాండు వరకు అమిత్ షా కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

బీజేపీ మొదటి నుండి ఓ వైపు అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తూ మరో వైపు అంబేద్కర్ వాదాన్ని, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని చూస్తున్న వారి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని అన్నారు. తక్షణమే అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత సామాజిక ప్రజా ఉద్యమ నాయకులు బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అశోక్, ప్రముఖ న్యాయవాది రామారావు, ఎస్సీ,,ఎస్టీ మానిటింగ్ కమిటీ సభ్యులు ఇమ్మయ్య, న్యాయవాది లక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.అశోక్, సీనియర్ నాయకులు అనంతయ్య, రాములు,లక్ష్మయ్య, జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, మాజీ సర్పంచ్ లు సాగర్ నాగరాజ్, ప్రభుదాస్, ప్రవీణ్, పవన్, బస్వరాజ్, నగేష్, దాసు, కృష్ణ, బాల్ రాజ్, దత్తు, ఉదయ్, యాదగిరి, సాగర్, సురేష్, సురేష్ నాయక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment