---Advertisement---

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

---Advertisement---

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు.
జూబ్లీహిల్స్‌లో కౌశిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో ఘర్షణ పడిన ఘటనలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 10 టీవీ ఆఫీసులో ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా 10టీవీ ఆఫీస్ వద్దే అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌కు తరలించే అవకాశం ఉంది.

కౌశిక్ రెడ్డి అరెస్ట్ తో పండగ పూట బీఆర్ఎస్ కు బిగ్ షాక్ గా మారింది. నిన్నటి ఘటనపై కరీంనగర్ లో మూడు కేసులు నమోదు అయ్యాయి. మరో వెపు కౌశిక్ రెడ్డిపై సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

 

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment