---Advertisement---

అసలు ఫార్ములా -ఈ కార్ రేస్ వివాదం ఏంటి? కేటీఆర్ చేసిన తప్పేంటి?

---Advertisement---

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదు అయింది. సెంటర్ ఆఫ్ ది న్యూస్ గా మారిన ఫార్ములా- ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం పై కేటీఆర్‌పై 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్‌, 409, 120B నాలుగు సెక్షన్ ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇందులో కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ అరవిందద్ A2, బీఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వంలో లో టాప్ 2 గా వ్యవహరించిన కేటీఆర్ పై ను అరెస్ట్ చేసేంతలా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో అసలేం జరిగింది? కేటీఆర్ పై చర్యలకు గవర్నర్ ఆమోదం దీనికి అవసరం వచ్చింది? ఎఫ్ఐఆర్ లో ఏం పేర్కొన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గవర్నర్ అనుమతి దీనికి?
ఫార్ములా -ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై చర్యలకు ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం లేఖ రాసింది. గవర్నర్ ఆమోదం తెలపడంతో తదుపరి చర్యల్లో భాగంగా సీఎస్ ఇటీవలే ఈ అంశంలో ముందుకు వెళ్లాలని ఏసీబీకి లేఖను రాశారు. సీఎస్ రాసిన లేఖతో ఇవాళ ఏసీబీ FIR నమోదు చేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం లొని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లు, అధికారం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చినా సంబంధిత వ్యవస్థ హెడ్ అనుమతి తీసుకోకుండా చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. దీని ప్రకారం ప్రస్తుత, మాజీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరం. అందుకే గవర్నర్ పర్మిషన్ వచ్చే వరకు కేటీఆర్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇంతకు ఈ రేస్ వివాదం ఏంటి?
ప్రపంచలోనే చాలా క్రేజ్ ఉన్న వాటిలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అసలేం జరిగింది? కేటీఆర్ చేసిన తప్పేంటి?

ఫార్ములా రేస్ ఒకటి. 70 ఏళ్లుగా ఫార్ములా 1 పేరుతో కారు రేస్ లను ఫెడరేషన్ ఆఫ్ ఇంటరనేషనల్ ఆటో మొబైల్స్ ఆర్గనైజ్ చేస్తున్నది. గతంలో ఫ్యూయల్ తో నడిచే కార్లు ఉండగా 2014 నుండి ఫార్ములా -ఈ రేస్ తెరమీదకు వచ్చింది. ఇంటర్ నేషనల్ కార్ రేస్ కు చాలా కాంపిటేషన్ ఉంటుంది. ఈ ఈవెంట్ జరిగితే తమ వద్ద పెట్టుబడులు పెరుగుతాయాని వీటి నిర్వహణకు దేశాలు రాష్ట్రాలు పోటీ పడుతాయి. హైదరాబాద్ లో నిర్వహించినపుడు కూడా మహారాష్ట్ర తో పాటు పలు రాష్ట్రాలు ఈ రేస్ తమ రాష్ట్రాల్లో నిర్వహించాలని కోరాయి.కానీ 2023 లో 9వ సీజన్ ఫార్ములా -ఈ రేస్ నిర్వహణ ఛాన్స్ హైదబాద్ కు దక్కింది. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ రేస్ ఈవెంట్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కార్.

మొత్తం నాలుగు సార్లు హైదరాబాద్ లో ఈ రేస్ నిర్వహించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది.తొలి రేస్ కు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్ షిప్ ఇచ్చాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య ఏర్పడింది. స్పాన్సర్లు లేకపోతే రేస్ నిర్వహించలేమని FIA ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రేస్ నిర్వహణ నాటికి స్పాన్సర్లను చూస్తామని అప్పటి వరకు హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు ఇస్తామని మంత్రి హోదాలో కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ నుంచి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే సీఎం, కేబినెట్ అనుమతి లేకుండా నిధులు ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024 ఫిబ్రవరి 10న జరగాల్సిన పదో సీజన్ ఈ రేస్ రద్దు అయింది. ఒప్పందం ప్రకారం కాకుండా ప్రభుత్వమే ఈ రేస్ నుంచి వైదలగడంతో గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎఫ్ఐఏ తిరిగి వెనక్కి ఇవ్వలేదు.

ఆర్బీఐ కి ఫైన్ చెల్లించిన కాంగ్రెస్ సర్కార్:
ఎలాంటి అనుమతి లేకుండానే ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని చెల్లించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్ విధించింది. వీటిని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐకి చెల్లించింది.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment