సందులో సడేమియా అనే సామెత వినే ఉంటారుగా.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే కల్చర్. ఏది ట్రెండింగ్ లో ఉంటుందో దాని చుట్టూ కంటెంట్ తిప్పి ఇంత హడావుడి చేయాలి. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ బెనిఫిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ చుట్టే ప్రచారం గుప్పు మంటోంది. అయితే తాజాగా ఈ ఘటన పై టికెట్లు మేమే కొనాలి, సావులు మేమే సవాలి అంటూ ఓ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహజంగానే ఈ పాటపై భిన్నభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. యాదవిధిగా కొందరు అల్లు అర్జున్ ను తప్పు పడుతుంటే మరి కొందరు ఈ సాంగ్ పై విమర్శలు చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటో చర్చకు దారి తీసినట్లయింది. ఈ పాట ద్వారా వచ్చిన డబ్బును చనిపోయిన రేవతి కుమారుడి ట్రీట్ మెంట్ కు ఇస్తారా అని ప్రశ్నించారు. వీళ్లకు డబ్బులు కావాలి జనాలకు దీనిపై ఇంట్రస్ట్ ఉంటుందో దానిమీద వీడియో తీస్తారు అంటూ కామెంట్ చేశాడు. మరి ఈ తరహా కామెంట్లపై సాంగ్ రూపొందించిన వారు ఎలా రియాక్ట్ అవుతారో మరి.