---Advertisement---

నిరాశ్రయులకు వెలుగు నీడ @ ఎబినేజర్ ఫౌండేషన్

Ebenezer foundation
---Advertisement---

ఆయన ప్రేమతో కదిలి బాణం. ఆప్యాయతకు, పేదలపాలిట అనురాగానికి నిలువెత్తు నిదర్శనం. కాలం ఎదురుతిరుగుతున్నా నిరుపేదలకు నేనున్నాంటూ కదులుతున్న ప్రేమ తరంగం… ఆయనే ఎబినేజర్ ఫౌండర్ సుదర్శన్ ఎల్గొయి. దైవం మానుషరూపేనా అన్న చందాన్ని నిజం చేస్తూ నిరాశ్రయులకు తనవంతుగా ఏదైనా సాయం చేయాలనే తపనతో సరిగ్గా ఏడాది క్రితం ఎబినేజర్ ఫౌండేషన్ ను స్థాపించిన బ్రదర్ సుదర్శన్ నిర్విరామంగా పేదలు, అభాగ్యుల కొరకు అనే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఎందరికో ఆదర్శంగా మారారు.

ఈ ఏడాది కాలంలో ఎబినేజర్ ఫౌండేషన్ అన్నదానం కార్యక్రమాలతో ఎందరిరో పేదల ఆకలిని తీర్చగలిగింది. మరెందరో నిరాశ్రయులకు అండగా నిలిచింది. ఎముకలు కొరికే చలిలో రోడ్లపై నిద్రిస్తున్న అభాగ్యులకు ఎబినేజర్ ఫౌండేషన్ తరపున దుప్పట్లు పంచడం ద్వారా వారికి తమ ప్రేమ రెక్కల కిందకు చేర్చుకోగలిగింది. వేసవి కాలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చగలుగుతోంది. రోడ్లపై జీవనం సాగించే మానసిక రోగులను గుర్తించి, వారిని సంరక్షణలోకి తీసుకుని స్నానం చేయించడం, కొత్త బట్టలు అందించడం వంటి కార్యక్రమాలతో వారి జీవితాల్లో కొత్త కాంతిని నింపుతోంది. మంచి పనులకు మంచిమనుషుల నుంచి సహకారం ఉంటుందన్నట్లుగానే బ్రదర్ సుదర్శన్ సేవాదృక్పథానికి మరికొంత మంది సహకారంగా నిలవడంతో ఎబినేజర్ ఫౌండేషన్ దిగ్విజయంగా ఏడాది కాలం మానవత్వాన్ని చాటుకోవడంలో ముందువరుసలో నిలించింది.

“మనుషుల మధ్య దూరాలు తగ్గించి, సేవ ద్వారా సమాజాన్ని ఒక తాటిపైకి తేవడమే మా లక్ష్యం. ఒక్క సంవత్సరంలో మేము చేసిన పని చిన్నదే కావచ్చు, కానీ ఇది మరెన్నో మంచి పనులకు నాంది కావాలని కోరుకుంటున్నాం,” అని ఎబినేజర్ ఫౌండర్ సుదర్శన్ ఎల్గొయి అన్నారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ తమ కార్యక్రమాలను మరింత విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని మానవత్వంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకు ఆర్థిక సహాకారం అందించాలని కోరారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment