---Advertisement---

చైనా కొత్త వైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

telangana govt release health advisory for hmpv virus
---Advertisement---

హెచ్ ఏంపివి వైరస్ పై సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తే, ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. HMPV అనేది కొత్త వైరస్ కాదని 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని చెప్పారు. గతం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని
ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం.
కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు రెగ్యులర్‌‌గా కోఆర్డినేట్ చేసుకుంటునామన్నారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం చేశారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment