---Advertisement---

ఉస్మానియా ఆసుపత్రి న్యూ బిల్డింగ్ పై సీఎం స్పీడ్

Osmania Hospital new building Telangana
---Advertisement---

హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్ పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఉస్మానియా ప్రస్తుత ఆసుపత్రిని అక్కడి నుంచి మార్చి గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్న నేపథ్యంలో సంబంధిత ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఆసుపత్రికి ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలని, రహదారుల విస్తరణకు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆ విషయంలో అన్ని శాఖలతో సమన్వయం కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ను నోడల్ అధికారిగా నియమించారు.

ఆసుపత్రికి ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , కలెక్టర్ అనుదీప్ గారు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment