---Advertisement---

సండే స్పెషల్: ‘ఆ ప్రేమ స్వరూపుడి మనసు మీరూ కలిగి ఉండుడి’: క్రిస్మస్ మెసేస్ బై రెవరెండ్ జే. యేసురత్నం

---Advertisement---

తండ్రియైన దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుని పంపించాడు. యెహవాను 3:16 దేవుడు లోకానికి తన ప్రేమను వెల్లడిపరుచుట ఎట్లనగా క్రీస్తు యేసు దేవుని స్వరూపం కల్గిన వాడైనను మానవాళి రక్షణ కోరకు మనుష్యుని పోలికగ జన్మించారు. ఫిలిప్పీ 2:6;7 క్రీస్తు యేసు తన ప్రజలందరికోరకు తన దేహాన్ని త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మానవులందరు పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోయారు. రోమ 3:23 కాని క్రీస్తు యేసు జననం మరణం పునరుత్థానమును మరియు తాను చూపిన మార్గాన్ని గ్రహించి యేసును నమ్మిన వారందరికి అనగా యేసుక్రీస్తు దేవుడిని నమ్మి విశ్వసించిన వారందరికి పాప విమోచన కలుగుచున్నది.

అంతే కాదు ఈ లోకములో ఎన్నికలేని వారిని ఎన్నుకొని 1కోరింథి 1:26,31 రాజులైన యాజకసముహములో ఉంచుట కోరికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. 1 పేతురు 2:9 ప్రభు వైన క్రీస్తు యేసు వెలుగై యున్నాడు. యోహను సువార్త 1:1,4 తాను ఈ లోకములో మానవ స్వరూపంలో జన్మించిన వెంటనే ఆకాశంలో తూర్పు దిక్కున ఒక తార వెలసింది. మత్తయి 2:2 క్రీస్తు యేసును నమ్మిన వారందరు వెలుగై యుంటారు. ఎఫెసీ 5:8,10 అతడు ప్రేమ దయ జాలి గుణం కల్గిన వాడు. కనుక మీరును క్రీస్తు యేసుకు కల్గిన మనసు కల్గి యుండుడి. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు మంచి మాటలు చెప్పుడి మీకు కల్గిన దానిలొ నుండి కొంత బీద లైన వారికి సహాయం చెయ్యండి. ప్రభు వైన క్రీస్తు యేసుని ప్రేమ దయ సదాకాలము మనందరి పై యుండును గాక!.

Christmas Message by Pastor Reverend J. Aesuratnam
Christmas Message by Pastor Reverend J.Yesuratnam

(ఈ వ్యాసాన్ని ‘మన ముచ్చట్లు’ ఎండోర్స్ చేయడం లేదు)

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment