ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాత్సారం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సాహసం రాష్ట్ర అధ్యక్షుడు డా.ముప్పారం ప్రకాశం డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా ఇంకా కమిషన్ల పేరుతో కాలయాపన చేయకూడదన్నారు. వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ న్యాయమూర్తి డా.షమీం అక్తర్ తన బృందంతో బుధవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి విశ్రాంతి భవనంలో కమిషన్ చైర్మన్ ను ముప్పారం ప్రకాశ్ కలిసి వర్గీకరణ చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ వర్గీకరణ అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ షెడ్యూల్ కులాల మధ్యలో తారతమ్యాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చూడకూడదని హెచ్చరించాడు. వర్గీకరణ అమలు చేయాల్సింది పోయి, విచారణ పేరుతో సాగదీయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తగదన్నారు. ఈ ప్రభుత్వం వర్గీకరణకు సిద్దమైనప్పుడు ఇంకా ఏం వివరణ కోసం కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తోందని ప్రశ్నించారు. తక్షణం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కమిషన్ల పేరుతో కాలయాపన వద్దు.. ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలి: ముప్పారం ప్రకాశం
by news writer
Updated On: December 4, 2024 6:08 pm

---Advertisement---





