యేసు క్రీస్తు ఈ లోకానికి రావాలి అంటే స్థలము అనేది దొరకలేదు. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను (లూకా 2:6-7). ఒకసారి ప్రపంచం గురించి మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి పర్మిషన్ ఇస్తున్నారు. మనిషి యొక్క ఆరోగ్యమును, జీవితమును పాడు చేసే వ్యర్థమైన వాటికి అనుమతి ఉంది. గుట్కాలు, సిగరెట్లు, బీడీలకు స్థలం ఉంది. డబ్బుంటే వైన్ షాప్ కు పర్మిషన్ వస్తుంది. యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రమే అనేక దేశాల్లో ప్రాంతాల్లో, అనేకుల జీవితాలలో స్థలము/స్థానం లేదు. ఒక మందిరం కట్టాలనుకుంటే ఎన్నో పర్మిషన్లు అవసరం అని అంటారు. మందిరానికి స్థలం లేదు. యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించేవారు ఈ స్థలంలో/ప్రాంతంలో ఉండకూడదు అని కొందరు బోర్డు పెట్టేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించే వారిని సేవకులను, విశ్వాసులను తృణీకరించే వారు చాలా మంది ఉన్నారు.
యేసు క్రీస్తు ఈ లోకంలోనికి మానవాళిగా జన్మించి మనిషిగా ఎలా బ్రతకాలి అని ఒక మాదిరిని చూపించాడు. నిస్వార్థంగా మీ పొరుగువారిని ప్రేమించడం, మీ శత్రువులను ప్రేమించడం, ఇతరులను క్షమించడం, ఇతరులకు సేవ చేయడం మరియు విశ్వాసం కలిగి ఉండటం మొదలైనవి ఆయన బోధలు. మన జీవితాన్ని మెరుగుపరిచే, మనకు మెరుగైన ఆంతర్గత శాంతిని కలిగి ఉండటానికి మరియు మన చుట్టూ ఉన్న వారితో మన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. మంచిని, ప్రేమను పంచిన యేసయ్యను అనేకులు తృతీణరిస్తున్నారు. నీవైన యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఆ ప్రభువు నీ దగ్గరికి వస్తాడు నీతో నీలో ఉంటాడు నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను నడిపించే నాయకునిగా ఉంటాడు. సత్రములో వారకి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.పశువుల తొట్టి అంతా మురికిగా ఉండే మన హృదయములను ఆ ప్రభువు కోరుతున్నాడు. మనలను ఆశీర్వదించుటకు ధనవంతుడై యుండియు దీనుడిగా ఈ లోకమునకు ఆ యేసు క్రీస్తు ప్రభువు వచ్చాడు (2 కొరింథీ 8:9) మొట్టమొదట ఆ ప్రభువు యొక్క ఆశీర్వాదం మనకు రక్షణ. నిన్ను దుష్టత్వము/పాపము/లోకములో నుండి విడిపించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2:11)/ పాప క్షమాపణ అనునది దేవుడు అనుగ్రహిస్తే పొందగలము, యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్షణ ద్వారా నిన్ను ధనవంతునిగా చేయుటకు ఈ లోకములోనికి/లోకానికి వచ్చాడు. ఇంత గొప్ప ఆశీర్వాదమును ఇచ్చిన యేసయ్యను సంతోషముగా ఆరాధించు, స్తుతించు.

PASTOR SAILESH ADAMS M
BETHEL APOSTOLIC MISSION ZAHEERABAD
CELL:+91 97052 50376
(ఈ వ్యాసాన్ని ‘మన ముచ్చట్లు’ ఎండోర్స్ చేయడం లేదు)







